MAFLD, NAFLD, MASH మరియు NASH అంటే ఏమిటి?
మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ సంబంధిత ఫ్యాటీ లివర్ వ్యాధిలో (MAFLD), ఒక వ్యక్తి కాలేయంలో చాలా అధికంగా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీనికి చికిత్స చేయకపోతే, మరింత తీవ్రమైన కాలేయ సమస్యలకు దారి తీసేలా వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. MAFLD అనేది కొత్త పదం, దీన్ని ఇంతకుముందు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) అనేవారు.
కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల వాపు మరియు ఫైబ్రోసిస్ సంభవించవచ్చు – ఈ దశను జీవక్రియ సరిగ్గా పని చేయకపోవడం వలన కలిగే స్టీటోహెపటైటిస్ (MASH) అంటారు. MASH అనేది కొత్త పదం, దీన్ని ఇంతకుముందు నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH) అనేవారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు శారీరక కార్యకలాపాలను పెంచడం వల్ల తీవ్ర స్థాయిలో కాలేయం దెబ్బ తినే స్థాయికి వ్యాధి ముదరకుండా ఆపవచ్చు.
ఎటువంటి చర్య తీసుకోకపోతే, మంట మరియు మచ్చలు కొనసాగడం వలన సిరోసిస్ అనే తీవ్రమైన కాలేయ రుగ్మత సంభవించవచ్చు.
కాలేయంలో సిరోసిస్ ఉన్నట్లయితే, మచ్చలు ఎక్కువగా పెరిగిపోయి, అది ఇకపై శరీరంలో తన కీలకమైన విధులను నిర్వహించలేకపోవచ్చు.
MASHతో బాధపడుతున్నవారికి ఊబకాయం మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి అదనపు సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
నా కాలేయంలో సమస్యలు ఉన్నట్లయితే, నాకు ఎలా తెలుస్తుంది?
MASH ప్రారంభ దశలో ఉన్న కొంతమందికి స్పష్టమైన లక్షణాలు ఏవీ ఉండవు. కొన్ని వైద్య పరీక్షలను చేయించుకోవడమే వీటిని నిర్ధారించడానికి ఉన్న ఏకైక మార్గం. కాలేయం పాడైపోయినప్పుడు త్వరగా నిర్ధారణ చేయడం అనేది చాలా ముఖ్యం, తద్వారా వ్యాధి మరింతగా ముదరకుండా ఆపడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. వీలైనంత త్వరగా సానుకూల మార్పులు చేయడం అనేది గుండె జబ్బు వంటి ఇతర సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయకరంగా ఉండవచ్చు.
వనశైలి మార్పులు
కొన్ని జీవనశైలి సంబంధ మార్పులను చేయడం అనేది తీవ్ర స్థాయిలో కాలేయం దెబ్బతినేలా (సిరోసిస్) వ్యాధి ముదరకుండా ఆపడంలో కీలకమైనది. ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక కార్యకలాపాల గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులు అందించే సలహాలు చాలా సహాయకరంగా ఉండవచ్చు. తగినంత సమయం నిద్రపోవడం కూడా ముఖ్యం.
చికిత్స ఎంపికలు
ఈ సమాచారాన్ని వ్రాసే సమయానికి, MAFLD లేదా MASHతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి వైద్యులు ప్రత్యేకంగా సూచించే చికిత్స ఎంపికలు చాలా పరిమితంగా ఉన్నాయి. మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత టైప్ 2 డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు వంటి MASHను క్లిష్టతరం చేసే రుగ్మతలకు చికిత్స అందించే మందులపై దృష్టి సారిస్తారు.
MASH కోసం చికిత్స ఎంపికలు పరిమితంగా ఉన్నాయి. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం నిర్దిష్టంగా సంభావ్య మందులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన వైద్య పరిశోధనలో మీరు కీలక పాత్ర పోషించవచ్చు.
సంబంధిత లింక్‌లు
దిగువ బటన్ని ఎంచుకోవడం ద్వారా, మీరు LIVERAGE™_LIVERAGE™ Cirrhosis అధ్యయనాల వెబ్సైట్ నుండి నిష్క్రమిస్తున్నట్లు మరియు LIVERAGE™_LIVERAGE™ Cirrhosis అధ్యయనాల వెబ్సైట్ గోప్యతా విధానం వర్తించని మరో వెబ్‌సైట్‌కు కొనసాగుతున్నట్లుగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
వెబ్‌సైట్‌కు కొనసాగించు