ఈ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ద్వారా మీ గురించి మేము సేకరించే వ్యక్తిగత డేటాను Boehringer Ingelheim International GmbH (ఇకమీదట “Boehringer Ingelheim”, “మేము”, “మా”, “మాకు”) ఎలా మరియు ఏ ప్రయోజనాల కోసం ప్రాసెస్ చేస్తుందనే అంశాలను ఈ గోప్యతా ప్రకటన వివరిస్తుంది.

విషయసూచిక
1. డేటా ప్రాసెసింగ్ ప్రయోజనాలు  
1.1 రిజిస్ట్రేషన్, కమ్యూనికేషన్ (వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఛానెల్‌లు)  
1.2 కుక్కీలు మరియు సంబంధిత డేటా ప్రాసెసింగ్ యొక్క వినియోగం (వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, విశ్లేషణ, అడ్వర్టయిజింగ్) 
1.3 ఫార్మాకోవిజిలెన్స్ 
1.4 తదుపరి ప్రయోజనాలు  
2. వ్యక్తిగత డేటా బదిలీ 
2.1 నియంత్రణాపరమైన అధికార యంత్రాంగాలకు రిపోర్టింగ్ బాధ్యతలు మరియు హక్కుల అమలు 
2.2 సర్వీస్ ప్రొవైడర్ (ప్రాసెసర్)  
2.3 Boehringer Ingelheim కంపెనీలు 
2.4 మూడవ పక్షాలకు బదిలీ  
2.5 ఇతర ఔషధ కంపెనీలు  
2.6 సోషల్ ప్లగిన్‌లు మరియు మూడవ పక్షం కంటెంట్  
2.7 EU వెలుపల గ్రహీతలకు డేటా బదిలీ 
3. నిలుపుదల వ్యవధులు
4. మీ హక్కులు 
5. సంప్రదింపు మరియు ప్రశ్నలు 
6. ఈ గోప్యతా నోటీసుకు మార్పులు

 

1. డేటా ప్రాసెసింగ్ ప్రయోజనాలు
1.1 రిజిస్ట్రేషన్, కమ్యూనికేషన్ (వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఛానెల్‌లు) 

మా వెబ్‌సైట్‌లలోమీకు సేవలను అందించడం కోసం, ఉదాహరణకు మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు, లాగిన్ చేసినప్పుడు, శిక్షణ కోర్సులు మరియు ఈవెంట్‌ల్లో పాల్గొన్నప్పుడు లేదా మాకు సందేశాలను పంపినప్పుడు మేము మీ డేటాను ప్రాసెస్ చేస్తాము.

మా సోషల్ మీడియా ఛానెల్‌లలో (Instagram, LinkedIn మొద.) ప్రచారాల్లో మీరు పాల్గొన్నప్పుడు లేదా మాకు విచారణలు లేదా వ్యాఖ్యలను పంపినప్పుడు కూడా మేము మీ డేటాను ప్రాసెస్ చేస్తాము.

దీనికి చట్టపరమైన ఆధారం ఆర్టికల్. 6 (1) బి) GDPR.

1.2 కుక్కీలు మరియు సంబంధిత డేటా ప్రాసెసింగ్ యొక్క వినియోగం (వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, విశ్లేషణ, అడ్వర్టయిజింగ్)

మేము కుక్కీలు (మీ బ్రౌజర్‌లో ఉంచిన చిన్న టెక్ట్స్ ఫైల్‌లు) మరియు పిక్సెల్ ట్యాగ్‌లు వంటి సారూప్య సాంకేతికతలను ఉపయోగిస్తాము (ఇకమీదట “కుక్కీలు” అని పిలుస్తారు).

1.2.1 అవసరమైన కుక్కీలు 

పేజీ నావిగేషన్, వెబ్‌సైట్‌లోని సురక్షిత ప్రాంతాలకు యాక్సెస్ లేదా భాషా సెట్టింగ్‌లు వంటి ప్రాథమిక ఫీచర్‌లను అందించడం ద్వారా వెబ్‌సైట్ సరిగ్గా పని చేయడానికి ఈ అవసరమైన కుక్కీలు ఉండాలి. చట్టపరమైన ఆధారం ఆర్టికల్ 6 (1) బి) GDPR ఈ అవసరమైన కుక్కీలను మేము 14 రోజులకు మించకుండా నిల్వ చేస్తాము

1.2.2 వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ మరియు విశ్లేషణ

మీ సమ్మతి ఆధారంగా, మేము కుక్కీలను సెట్ చేస్తాము మరియు మీరు మా వెబ్‌సైట్‌లను ఎలా ఉపయోగిస్తున్నారనేది విశ్లేషిస్తాము. ఈ విధంగా, నిర్దిష్ట సేవలు ఎంత బాగా స్వీకరించబడుతున్నాయనే దాని గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము, అలాగే వాటిని మరియు మా వెబ్‌సైట్‌లను మేము సర్దుబాటు చేయవచ్చు మరియు మెరుగుపరచవచ్చు.

మీరు ఏ సమయంలోనైనా మీ సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు

1.3 ఫార్మాకోవిజిలెన్స్ 

ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీగా, ప్రతికూల ప్రభావాలు లేదా ఏదైనా ఇతర ఔషధ సంబంధిత సమస్యను గుర్తించడం, మూల్యాంకనం చేయడం, అర్థం చేసుకోవడం మరియు నివారించడం కోసం కొన్ని కార్యకలాపాలను Boehringer Ingelheim నిర్వహించాల్సి ఉంటుంది, వీటిని ఫార్మాకోవిజిలెన్స్ బాధ్యతలు అని కూడా అంటారు. ఫార్మాకోవిజిలెన్స్ బాధ్యతల ప్రకారం, రోగి మరియు/లేదా ప్రతికూల ఈవెంట్‌ను రిపోర్ట్ చేసినవారు వంటి ఎవరైనా వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి మమ్మల్ని అనుమతించే నిర్ధిష్ట సమాచారాన్ని (వ్యక్తిగత డేటా) మేము ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

మేము ఈ క్రింది వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయాల్సి ఉండవచ్చు:

రిపోర్ట్ చేసినవారి గురించి:

  • పూర్తి పేరు, తొలి అక్షరాలు మరియు సంప్రదింపు వివరాలు (ఇందులో మీ చిరునామా, ఇ-మెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్‌ వంటి వివరాలు ఉండవచ్చు), వృత్తి (ఉదా., వైద్యులు, ఫార్మసిస్ట్).

రోగి గురించి (రిపోర్ట్‌లో ఉన్న సబ్జెక్ట్):

  • తొలి అక్షరాలు (ఇవ్వబడిన విధంగా) రోగి పేరు కాదు; లింగం; వయస్సు / పుట్టిన తేదీ / వయో సమూహం;
  • ప్రతిచర్య కలగడానికి కారణమని అనుమానించబడుతున్న Boehringer Ingelheim ఉత్పత్తికి సంబంధించిన వివరాలు, ఉపయోగానికి సంబంధించిన సమాచారం, బ్యాచ్ నంబర్;
  • ప్రతికూల సంఘటనకు సంబంధించిన తదుపరి వివరాలు: ఖచ్చితంగా అసలు ఏమి జరిగింది?; ప్రతికూల ఘటన వ్యవధి మరియు ఫలితం, ప్రారంభ మరియు ముగింపు తేదీ, మొదటిసారి వినియోగిస్తున్నారా?, అనుబంధ మందులు మరియు/లేదా వ్యాధులపై సమాచారం; ఘటన యొక్క తీవ్రత; Boehringer Ingelheim ఉత్పత్తి మరియు ప్రతికూల ఘటన మధ్య సంభావ్య సాధారణ సంబంధంపై రోగి మరియు/లేదా రిపోర్టర్ దృక్కోణం;

ప్రతికూల ఘటనలపై అధిక నాణ్యత గల మరియు పూర్తి సమాచారాన్ని పొందడం కోసం రిపోర్టర్‌ని ఫాలో-అప్ చేయడానికి వీలుగా సంప్రదింపు సమాచారం అభ్యర్థించబడింది. రిపోర్టర్ తన సంప్రదింపు వివరాలను Boehringer Ingelheim లేదా అధికారులకు అందించడానికి ఇష్టపడకపోతే, రిపోర్టర్ పేర్ల ఫీల్డ్‌లో “గోప్యత” అని రిపోర్టర్ నమోదు చేయవచ్చు.

మేము క్రింది ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయవచ్చు: (I) రిపోర్ట్ చేసిన ప్రతికూల ఘటనను విశ్లేషించడం; (ii) తదుపరి సమాచారం కోసం రిపోర్టర్‌ని సంప్రదించడం; (iii) Boehringer Ingelheim International GmbH ద్వారా నిర్వహించబడే మా గ్లోబల్ ఫార్మాకోవిజిలెన్స్ డేటాబేస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా Boehringer Ingelheim అందుకున్న ఇతర ప్రతికూల ఘటనల గురించిన సమాచారంతో ప్రతికూల ఘటనకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించడం మరియు విశ్లేషించడం; అలాగే (iv) ఫార్మాకోవిజిలెన్స్ సంబంధిత సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అధికారులకు రిపోర్ట్ చేయడం. రిపోర్ట్ చేయబడిన వ్యక్తిగత డేటా కేవలం ఈ ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతుంది. ప్రత్యేక వర్గాలకు చెందిన వ్యక్తిగత డేటాతో సహా ఫార్మాకోవిజిలెన్స్ సంబంధిత వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి చట్టపరమైన ఆధారం అనేది సెక్షన్ 22 (1) (సి) జర్మన్ ఫెడరల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుబంధంగా, ఇంకా EUకు వెలుపల బదిలీల కోసం ఆర్టికల్ 49 (1) ఈ) GDPRకు అనుబంధంగా ఆర్టికల్ 9 (2) (i) GDPRగా ఉంటుంది.

సంబంధిత Boehringer Ingelheim ఉత్పత్తిని మార్కెట్లో ఉంచిన ఏ దేశంలోనైనా మార్కెట్ ఆథరైజేషన్ సమయ వ్యవధితో పాటుగా మార్కెటింగ్ ఆథరైజేషన్ గడువు ముగిసిన తర్వాత కనీసం పది (10) సంవత్సరాల పాటు మీ వ్యక్తిగత డేటాను కలిగి ఉండే ఫార్మాకోవిజిలెన్స్ సంబంధిత సమాచారాన్ని ఆర్కైవ్ చేయడానికి మేము చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నాము.

1.4 తదుపరి ప్రయోజనాలు 

అవసరమైతే, క్రింది అదనపు ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత డేటాను మేము ప్రాసెస్ చేస్తాము: 

  • ఈ దిగువవాటితో సహా, మా చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం (ఆర్టికల్ 6 (1) ఎఫ్) GDPR):

    (i) కార్పొరేట్ లావాదేవీని పూర్తి చేయడం (ఉదా. కార్పొరేట్ పునర్నిర్మాణం, ఆస్తుల అమ్మకం లేదా కేటాయింపు, విలీనం);

    (ii) మా హక్కులు, ఆస్తులు మరియు ప్రయోజనాలను రక్షించుకోవడం, అమలుపరచడం మరియు కాపాడటం;
  • చట్టపరమైన బాధ్యతలు, న్యాయస్థాన ఉత్తర్వులు లేదా ప్రభుత్వ అధికార యంత్రాంగాల యొక్క ఇతర నిర్బంధ నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం (ఆర్టికల్ 6 (1) సి) GDPR).
  • ఆర్టికల్ 13(2)(ఈ) GDPR ప్రకారం ఒప్పందపరమైన/చట్టబద్ధమైన ఆవశ్యకతగా.
2. వ్యక్తిగత డేటా బదిలీ 

మేము వ్యక్తిగత డేటాను మూడవ పక్షాలతో షేర్ చేయవచ్చు మరియు/లేదా వెల్లడించవచ్చు:

2.1 నియంత్రణాపరమైన అధికార యంత్రాంగాలకు రిపోర్టింగ్ బాధ్యతలు మరియు హక్కుల అమలు 

చట్టపరమైన రిపోర్టింగ్ బాధ్యతలకు లోబడి ఉండటానికి, మా హక్కులు మరియు/లేదా మూడవ పక్షాల హక్కులను రక్షించడానికి, చట్టపరమైన నియమాలకు అనుగుణంగా హక్కుదారులు, కన్సల్టెంట్‌లు, న్యాయస్థానాలు మరియు సమర్థ అధికార యంత్రాంగాలకు వ్యక్తిగత డేటాను మేము షేర్ చేయవచ్చు మరియు వెల్లడించవచ్చు (ఉదా. అనుమానాస్పద ప్రతికూల ఘటనకు సంబంధించి తప్పనిసరి రిపోర్ట్‌లు).

2.2 సర్వీస్ ప్రొవైడర్ (ప్రాసెసర్) 

ఈ గోప్యతా విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మేము సర్వీస్ ప్రొవైడర్‌లను నియమిస్తాము. ఈ సర్వీస్ ప్రొవైడర్‌లు మా తరఫున, మా సూచనల ప్రకారం, మా నియంత్రణలో మరియు ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా మాత్రమే డేటాను ప్రాసెస్ చేస్తారు. 

2.3 Boehringer Ingelheim కంపెనీలు 

గ్లోబల్ గ్రూప్ కంపెనీల్లో భాగంగా, డేటా ప్రాసెసింగ్‌ విషయంలో మాకు మద్దతు ఇచ్చే ఇతర Boehringer Ingelheim కంపెనీలను మేము నియమించుకుంటాము (ఉదా. రిపోర్ట్ చేయబడిన ప్రతికూల ఘటనను విశ్లేషించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి మా ఫార్మాకోవిజిలెన్స్ బాధ్యతల్లో భాగంగా). ఆర్టికల్ 26 GDPR ప్రకారం ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఈ గ్రూప్ కంపెనీలు ప్రత్యేకంగా డేటాను జాయింట్ కంట్రోలర్‌గా ప్రాసెస్ చేస్తాయి.

2.4 మూడవ పక్షాలకు బదిలీ 

స్వంత బాధ్యత కింద మరియు వారి స్వంత ప్రయోజనాల కోసం డేటాను ప్రాసెస్ చేసే ఒప్పంద భాగస్వాములకు (ఉదా., మీరు మీ సమ్మతిని ఇచ్చినట్లయితే, LinkedIn లేదా Twitter) మేము డేటాను బదిలీ చేస్తాము. ఈ గోప్యతా విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటా బదిలీ చేయబడుతుంది.

2.5 ఇతర ఔషధ కంపెనీలు  

Boehringer Ingelheim కంపెనీల గ్రూప్‌తో సహ-మార్కెటింగ్, సహ-పంపిణీ లేదా ఇతర లైసెన్స్ భాగస్వాములుగా ఉన్న ఇతర ఔషధ కంపెనీలతో వ్యక్తిగత డేటాను కలిగి ఉండే ఫార్మాకోవిజిలెన్స్ సంబంధిత సమాచారాన్ని మేము పంచుకోవచ్చు, Boehringer Ingelheim ఉత్పత్తి కోసం ఫార్మాకోవిజిలెన్స్ బాధ్యతలకు అటువంటి భద్రతా సమాచార మార్పిడి అవసరమైన పక్షంలో; ఈ కంపెనీలు మా తరఫున, మా సూచనల ప్రకారం, మా నియంత్రణలో మరియు ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా మాత్రమే డేటాను ప్రాసెస్ చేస్తాయి.

2.6 సోషల్ ప్లగిన్‌లు మరియు మూడవ పక్షం కంటెంట్

మీరు మా వెబ్‌సైట్ (సోషల్ ప్లగిన్‌లు) సందర్శించినప్పుడు సమాచారం ఆటోమేటిక్‌గా సోషల్ మీడియా సేవల ప్రొవైడర్‌కు బదిలీ చేయబడే విధంగా మేము ఎలాంటి టూల్‌లను అమలు చేయలేదు.

YouTube, Meta మొదలైనటువంటి సోషల్ మీడియా ప్రొవైడర్‌లకు ఏదైనా ఫార్వార్డ్ చేసే ప్రక్రియ అనేది ప్రత్యేకంగా లింక్ ద్వారా జరుగుతుంది, తద్వారా మా సేవలకు మీ సందర్శన యొక్క డేటా (ఉదా. IP చిరునామా, సమయం, URL) లేదా మీ తుది పరికరంలో అందుబాటులో ఉండే డేటా (ఉదా. కుక్కీ సమాచారం) అనేది లింక్‌ను వివేకంతో ఉపయోగించినప్పుడు మాత్రమే సంబంధిత ప్రొవైడర్‌లకు ప్రసారం చేయబడుతుంది.

2.7 EU వెలుపల గ్రహీతలకు డేటా బదిలీ

అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు, వ్యాపార భాగస్వాములు మరియు Boehringer Ingelheim కంపెనీలు EU వెలుపల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయవచ్చు. ఈ సందర్భాలలో, యూరోపియన్ చట్టానికి అనుగుణంగా తగిన స్థాయిలో డేటా రక్షణను (సాధారణంగా యూరోపియన్ కమీషన్ ప్రచురించిన ఈయు ప్రామాణిక ఒప్పంద క్లాజుల ద్వారా లేదా అవసరమైతే, ఇతర సముచితమైన రక్షణల ద్వారా) మేము నిర్ధారిస్తాము. దిగువ పేర్కొన్న సంప్రదింపు వివరాలను ఉపయోగించి మా డేటా గోప్యతా అధికారిని సంప్రదించడం ద్వారా వ్యక్తిగత డేటాకు సంబంధించి తగిన రక్షణను అమలు చేసే ఒప్పందం కాపీని మీరు అభ్యర్థించవచ్చు.

3. నిలుపుదల వ్యవధులు

సాధారణంగా మీరు అభ్యర్థించిన సేవలను అందించడం వంటి సంబంధిత ప్రయోజనాల కోసం అవసరమైనంత కాలం వరకు Boehringer Ingelheim మీ వ్యక్తిగత డేటాను నిల్వ చేస్తుంది. ఉదాహరణకు, (లాగిన్, వృత్తి, పేరు మొద.) మీ వినియోగదారు ఖాతా డేటాను మీరు తొలగించే వరకు మేము నిల్వ చేస్తాము. కొన్ని సందర్భాల్లో, చట్టబద్ధమైన నిలుపుదల వ్యవధులకు లోబడి ఉండటం కోసం మీ డేటాను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. నిర్ధిష్ట ప్రాసెసింగ్ ప్రయోజనాల కోసం మేము నిర్ధిష్ట నిలుపుదల వ్యవధులను కలిగి ఉన్నాము.

4. మీ హక్కులు

మీకు క్రింది హక్కులు ఉన్నాయి: 

  • Boehringer Ingelheim ద్వారా ప్రాసెస్ చేయబడిన మీ వ్యక్తిగత డేటా గురించి సమాచారాన్ని అభ్యర్థించడం; 
  • సమర్థనీయమైన సందర్భాల్లో, మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ యొక్క తొలగింపు, సవరణ లేదా నియంత్రణను అభ్యర్థించడం;
  • నిర్దిష్ట పరిస్థితులలో, మీ వ్యక్తిగత డేటాను మీకు లేదా మరొక వ్యక్తికి సాధారణంగా ఉపయోగించదగిన ఫార్మాట్‌లో బదిలీ చేయమని అభ్యర్థించడం;
  • డేటా రక్షణ అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం;
  • ప్రాసెసింగ్ ప్రయోజనాల కోసం ఇక మీ వ్యక్తిగత డేటా అవసరం లేనట్లయితే లేదా తదుపరి ప్రాసెసింగ్‌కు చట్టపరమైన ఆధారం లేనట్లయితే దాన్ని తొలగించమని అభ్యర్థించడం.
  • మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడం అనేది కేవలం Boehringer Ingelheim యొక్క చట్టబద్ధమైన ప్రయోజనం (ఆర్టికల్ 6 (1) ఎఫ్) GDPR ఆధారంగా ఉండేంత వరకు ఎప్పుడైనా ఆ ప్రాసెసింగ్‌కు అభ్యంతరం తెలపడం. ఈ సందర్భంలో, Boehringer Ingelheim ప్రయోజనాలు ఉన్నట్లయితే తప్ప, అటువంటి వ్యక్తిగత డేటాను మేము ఆపై ప్రాసెస్ చేయము. ప్రయోజనాలను బేరీజు వేయకుండా డైరెక్ట్ మార్కెటింగ్ ఉద్దేశ్యాల కోసం డేటాను ఉపయోగించడం పట్ల మీరు అభ్యంతరం తెలపవచ్చు.

మీరు మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు మీ సమ్మతిని తెలియజేసి ఉన్నట్లయితే, మీరు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చు; అటువంటి ఉపసంహరణ వరకు ప్రాసెసింగ్ చట్టబద్ధతపై ఆ విధంగా ఉపసంహరించుకోవడం వలన ఎలాంటి ప్రభావం ఉండదు.

5. సంప్రదింపు మరియు ప్రశ్నలు

మీకు ఈ గోప్యతా నోటీసు గురించి లేదా మీ వ్యక్తిగత డేటాని మేము ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, దయచేసి దిగువ చిరునామాలో మమ్మల్ని సంప్రదించండి:

Boehringer Ingelheim International GmbH
– డేటా సంరక్షణ అధికారి –
Binger Strasse 173, D-55216 Ingelheim am Rhein, Germany
ఇమెయిల్: datenschutz@boehringer-ingelheim.com 

డేటా ప్రాసెసింగ్ గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉన్నట్లయితే, మీరు ఎవరైనా పర్యవేక్షణ అధికారిని కూడా సంప్రదించవచ్చు. Boehringer Ingelheim యొక్క బాధ్యతాయుతమైన అధికార సంస్థ:

Der Landesbeauftragte für den Datenschutz und die Informationsfreiheit Rheinland-Pfalz
Hintere Bleiche 34, 55116 Mainz, Germany
ఇమెయిల్: poststelle@datenschutz.rlp.de

6. ఈ గోప్యతా నోటీసుకు మార్పులు 

మేము ఈ గోప్యతా విధానాన్ని సమయానుగుణంగా అప్‌డేట్ చేయవచ్చు. మా గోప్యతా ప్రకటనకు చేసే అప్‌డేట్‌లు ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడతాయి. ఏవైనా సవరణలు మా వెబ్‌సైట్‌లో ప్రచురించబడివ తర్వాత అమలులోకి వస్తాయి.

చివరిగా అప్‌డేట్ చేసినది: ఆగస్టు 2021