వివిధ దశల్లో ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులలో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చో లేదో చూడటానికి, LIVERAGE™ మరియు LIVERAGE™ Cirrhosis వైద్య పరిశోధన అధ్యయనాలు ఒకే అధ్యయన ఔషధాన్ని మూల్యాంకనం చేస్తున్నాయి.
LIVERAGE™ మరియు LIVERAGE™ Cirrhosis రెండింటిలో ఉపయోగించే అధ్యయన ఔషధాన్ని సర్వోడుటైడ్ అని అంటారు. సర్వోడుటైడ్ క్రింది ప్రయోజనాల కోసం రూపొందించబడింది:
- శరీర బరువును తగ్గించడం మరియు శక్తి వినియోగాన్ని పెంచడంలో సహాయపడటం.
- రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడం.
- కాలేయంలో కొవ్వు పదార్థం, కాలేయం గట్టితనాన్ని తగ్గించడం.
రెండు అధ్యయనాలు సర్వోడుటైడ్‌ని ప్లేసిబోతో పోలుస్తాయి. ప్లేసిబో చూడటానికి సర్వోడుటైడ్ వలె ఉంటుంది, కానీ చికిత్సాపరమైన విలువ ఉండదు.
మీరు సర్వోడుటైడ్ను స్వీకరించడానికి 3లో 2 (67%) అవకాశం ఉంటుంది మరియు ప్లేసిబోను స్వీకరించడానికి 3లో 1 (33% అవకాశం) ఉంటుంది. ఇది కంప్యూటర్ ద్వారా యాదృచ్ఛికంగా (అంటే అవకాశం ప్రకారం) ఎంపిక చేయబడుతుంది. మీరు సర్వోడుటైడ్ లేదా ప్లేసిబోలో దేన్ని పొందుతున్నారనే విషయం మీకు గానీ లేదా అధ్యయన బృందానికి గానీ తెలియదు. పక్షపాతంతో కూడిన అభిప్రాయాలు లేదా అంచనాలు ఏవీ లేకుండా ఫలితాలు న్యాయంగా ఉండేలా చూసుకోవడానికి ఈ వ్యూహం తరచుగా క్లినికల్ అధ్యయనాలలో ఉపయోగించబడుతుంది.
సర్వోడుటైడ్ మరియు ప్లేసిబో రెండూ చర్మం కింద స్వయంగా ఇంజెక్షన్ చేసుకోవడం ద్వారా వారానికి ఒకసారి ఇవ్వబడతాయి. అధ్యయన ఇంజెక్షన్‌లను మీరే స్వంతంగా ఎలా వేసుకోవాలో మీకు చూపించబడుతుంది. మీకు దీన్ని చేయగల సామర్థ్యం మరియు ఆత్మవిశ్వాసం ఉండేలా చేయడానికి పూర్తి శిక్షణ ఇవ్వబడుతుంది. మీరు స్వయంగా ఇంజెక్షన్ వేసుకోలేకపోతే, ఇతర ఏర్పాట్లు చేయబడవచ్చు.
చాలావరకు ఔషధాల (ఆమోదించబడినవి మరియు అధ్యయన ఔషధాలు) ఉపయోగానికి సంబంధించి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే, ప్రతి ఒక్కరికీ అవి సంభవిస్తాయని గ్యారెంటీ లేదు. మునుపటి వైద్య అధ్యయనాల ఫలితాల ఆధారంగా, ప్రధాన దుష్ప్రభావాలు మీ జీర్ణవ్యవస్థకు సంబంధించినవి. సర్వోడుటైడ్‌కు సంబంధించిన ఏవైనా దుష్ప్రభావాలు తాత్కాలికంగా, పర్యవేక్షించడానికి సులభంగా మరియు అధ్యయన ఏర్పాటులో నిర్వహించగల విధంగా ఉంటాయని అంచనా వేయడమైనది. పాల్గొనడానికి మీకు ఆసక్తి ఉంటే, అధ్యయన బృందం సభ్యులు ఈ అంశాన్ని మీతో చర్చించడానికి సంతోషిస్తారు.
ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవాట్లను అలవరుచుకోవడంలో మీకు సహాయకరంగా ఉండే దీర్ఘకాలిక పోషకాహార మరియు శారీరక కార్యకలాపాల సలహాలను మీరు స్వీకరించవచ్చు.
అధ్యయనాలకు ఎలాంటి స్థిరమైన వ్యవధి లేదు. LIVERAGE™ అధ్యయనంలో పాల్గొనడం సుమారు 7 సంవత్సరాలు ఉండవచ్చు. LIVERAGE™ Cirrhosis అధ్యయనంలో పాల్గొనడం సుమారు 4.5 సంవత్సరాలు ఉండవచ్చు.
మీరు క్రమబద్ధంగా అధ్యయన సందర్శనలకు హాజరవుతారు. కొన్ని అధ్యయన సైట్ వద్ద జరుగుతాయి, మరికొన్ని వీడియో కాల్ ద్వారా రిమోట్‌గా ఏర్పాటు చేయబడతాయి. సందర్శనలు ప్రారంభంలో ప్రతి 2 వారాలకు ఒకసారి ఉంటాయి, తరువాత ప్రతి 4 వారాలకు ఒక్కసారి, ఆపై 6వ నెల నుండి 6 వారాలకు మారుతాయి.
అధ్యయనం అంతటా, మీ అధ్యయన ఇంజెక్షన్‌ల తేదీలు మరియు సమయాలను రికార్డ్ చేయడానికి, అలాగే మీ పోషకాహారం మరియు శారీరక కార్యకలాపాల వివరాలను నమోదు చేయడానికి మీరు డైరీలను పూరించాల్సి ఉంటుంది.
మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాలేయ బయాప్సీలు అవసరం కావచ్చు. ఇందుకోసం అధ్యయన సైట్‌లో ఒక ప్రక్రియ సమయంలో మీ కాలేయ కణజాలం యొక్క చిన్న మొత్తం తీసివేయబడుతుంది. మీ కుడి పక్కటెముక కింద సూదిని పంపే ముందు మీకు స్థానికంగా తిమ్మిరి ఎక్కేటట్లుగా చేయబడుతుంది. ఈ సూది ప్రత్యేకంగా రూపొందించబడింది, ఇది కాలేయ కణజాలం యొక్క చిన్న భాగాన్ని తీసివేయగలదు. ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు అధ్యయన వైద్యులు స్క్రీన్‌పై మీ శరీరం యొక్క ప్రత్యక్ష చిత్రాన్ని చూడగలుగుతారు. ఈ ప్రక్రియ సమయంలో మీరు ఏమి ఆశించవచ్చు అనేది వివరించే వీడియో కోసం ఈ పేజీ దిగువకు స్క్రోల్ చేయండి.